|
|
 |  |  |
| |
స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!
తాత్పర్యం: స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలలితము భంగిన్ సిరి దాఁ బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
తాత్పర్యం: సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది. |
| |
 |  |  |
|
 |  |  |
| |
మేలెంచని మాలిన్యుని మాలను నగసాలివాని మంగలి హితుగా నేలిన నరపతి రాజ్యము నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!
తాత్పర్యం: ఉపకారాన్ని గుర్తుంచుకోని దుర్మార్గుడ్ని, పంచముని, కంసాలివానిని, మంగలిని హితలుగా చేసుకొని పాలించే రాజు రాజ్యము మట్టిలో కలిసి నాశనం అవుతుంది కానీ కీర్తిని పొందదు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!
తాత్పర్యం: హాస్యపు మాటలు విరోధము కొరకే. సంపూర్ణ సౌఖ్యాలు విస్తారమైన బాధల కోసమే. పొడవుగా ఎదుగుట విరిగిపోవడానికే. ధరవరలు తగ్గడం మళ్లీ పెరగడానికే అని మనుషులు తెలుసుకోవాలి. |
| |
 |  |  |
|
 |  |  |
| |
శుభముల నొందని చదువును అభినయమున రాగరసము నందని పాటల్ గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
తాత్పర్యం: శుభాలు పొందని విద్య, నటన, సంగీత, సామరస్యంతో కూడిన పాటలు, సందడి లేని కలయిక, సభల్లో మెప్పు పొందని మాటలు రుచించవు. చప్పనయినవి. |
| |
 |  |  |
|
 |  |  |
| |
వేసరవు జాతి కానీ వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ దాసి కొడుకైన గాని కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
తాత్పర్యం: నీచ జాతివాడైనా, నిష్ప్రయోజకుడైనా, దాసీ పుత్రుడైనా ధనం కలవాడే అధిపతి |
| |
 |  |  |
|
 |  |  |
| |
వెలయాలు సేయు బాసలు వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్ గలలోఁన గన్న కలిమియు, విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
తాత్పర్యం: వేశ్య ప్రమాణాలు, విశ్వబ్రాహ్మణుని స్నేహం, వెలమదొరల జత, కలలో చూసిన సంపదలను స్పష్టంగా నమ్మరాదు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
వెలయాలివలనఁ గూరిమి
గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా పలువురు నడిచెడి తెరుపునఁ బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!
తాత్పర్యం:పదిమంది నడిచే బాటలో పచ్చగడ్డి మొలవదు. ఒకవేళ మొలిచినా పెరగదు. ఆ విధంగానే వేశ్యవల్ల ప్రేమ లభించదు. ఒకవేళ లభించినా ఎక్కువకాలం నిలవదు. • |
| |
 |  |  |
|
 |  |  |
| |
వీడెము సేయని నోరును జేడెల యధరామృతంబుఁ జేయని నోరును బాడంగరాని నోరును బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
తాత్పర్యం: తాంబూలం వేసుకోని, స్త్రీల అధరామృత పానం చేయని, గానం చేయని నోరు పెంట బూడిద పోసుకొనే గోయితో సమానం సుమా! |
| |
 |  |  |
|
 |  |  |
| |
వినదగు నెవ్వరుచెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము దెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!
తాత్పర్యం: ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
వరి పంటలేని యూరును దొరయుండని యారు తోడు దొరకని తెరువున్ ధరను బతిలేని గృహమును అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
తాత్పర్యం: ధాన్యం పంటలేని గ్రామం, రాజు నివశింపని నగరం, సహాయం దొరకని మార్గం, భర్త (రాజు)లేని గృహం ఆలోచించగా స్మశానంతో సమానమని చెప్పవచ్చు. • |
| |
 |  |  |
|
 |  |  |
| |
వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగకుమీ పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
తాత్పర్యం: వరద ముంచిన చేనును దున్నవద్దు. కూడు కరవైనను బంధువుల ఇంటికి పోవద్దు. ఇతరులకు రహస్యాల్ని చెప్పవద్దు. పిరికివాడికి సేనానాయక పదవిని ఇయ్యవద్దు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
లావుగలవానికంటెను భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ గ్రావంబంత గజంబును మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
తాత్పర్యం: పెద్ద పర్వతమంటి ఏనుగుకంటే చిన్నవాడైన మావటి లోబరుచుకుని ఎక్కుచున్నాడు కనక మావటి గొప్పవాడు. అలాగే శరీరబలం కలవాని కంటే బుద్ధిబలం కలవాడే నిజమైన బలవంతుడు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ గోపించురాజుఁ గొల్వకు పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!
తాత్పర్యం: సాక్షులతో నిర్ధారణ చేసి అబద్ధాన్ని నిజమని స్థిరపరచడం, ఆప్తబంధువులను నిందించడం, కోపిని సేవించడం, పాపభూమికి వెళ్లడం తగని పనులు. కావున ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. |
| |
 |  |  |
|
 |  |  |
| |
రా పొమ్మని పిలువని యా భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే దీపంబు లేని ఇంటను చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!
తాత్పర్యం: దీపంలేని ఇంట్లో చేవుణికీళ్లాట ఆడితే ఏవిధంగా ఆనందం కలగదో ఆ విధంగానే రమ్మని కానీ పొమ్మని కానీ చెప్పని రాజును సేవించడం వల్ల జీవమూ లేదు. మోక్షమూ లేదు. వట్టి నిష్ప్రయోజనం. |
| |
 |  |  |
|
 |  |  |
| |
నాది నొకని వలచియుండగ మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్ బొది జిలుక పిల్లి పట్టిన జదువునె యా పంజరమున జగతిని సుమతీ!
తాత్పర్యం: పిల్లి పంజరాన్ని పట్టుకుంటే ఆ పంజరంలో ఉన్న చిలుక మాట్లాడుతుందా? అలాగే, మనసులో ఒకతన్ని ప్రేమించిన స్త్రీ విటుడు ఎంత బతిమాలినా ప్రేమించదు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెడు జలములలోపల నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!
తాత్పర్యం: అభిమాన శ్రేష్టుడు మనోధైర్యం చెడి అల్పుని ఆశ్రయించడం మానెడు నీళ్లలో ఏనుగు తన శరీరాన్ని మరుగుపరచినట్లుండును. |
| |
 |  |  |
|
 |  |  |
| |
బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!
తాత్పర్యం: నేను చాలా బలవంతుడ్ని. నాకేమీ భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు. అది ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావడం లేదా? |
| |
 |  |  |
|
 |  |  |
| |
బంగారు కుదువబెట్టకు సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో నంగడి వెచ్చములాడకు వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!
తాత్పర్యం: బంగారు నగలను తాకట్టు పెట్టవద్దు. యుద్ధభూమి నుంచి వెన్నిచ్చి పారిపోవద్దు. దుకాణం నుంచి సరకులు అరువు తెచ్చుకోవద్దు. మూఢునితో స్నేహం చేయవద్దు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
పొరుగున పగవాడుండిన నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్ ధరఁగాఁపు కొండెమాడినఁ గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
తాత్పర్యం: ఇంటి పక్కనే శతృవు ఉన్నా, బాగా రాయగలవాడే ప్రభువు అయినా, గ్రామ పెత్తందారు కొండెములు చెప్పేవాడయినా లేఖరుకు జీవితం గడవదు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
పులిపాలు దెచ్చిఇచ్చిన నలవడఁగ గుండెగోసి యరచే నిడినం దలపొడుగు ధనము బోసిన వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!
తాత్పర్యం: దుస్సాధ్యమైన పులిపాలు తెచ్చి ఇచ్చినా, హృదయాన్ని కోసి అరచేతిలో పెట్టినా, నిలువెత్తు ధనం పోసినా వేశ్యకు నిజమైన ప్రేమ ఉండదు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
తాత్పర్యం: కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడ్ని మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుంది. |
| |
 |  |  |
|
 |  |  |
| |
పురికిని బ్రాణము కోమటి వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం గరికిని బ్రాణము తొండము సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!
తాత్పర్యం: ఈ లోకంలో పట్టణానికి వైశ్యుడు, వరిసస్యమునకు నీళ్లు, ఏనుగుకు తొండము, ఐశ్వర్యానికి స్త్రీ జీవం ఒసంగుదురు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
పిలువని పనులకు బోవుట కలయని సతి రతియు రాజు గానని కొలువు బిలువని పేరంటంబును వలవని చెలిమియును జేయవలదుర సుమతీ
తాత్పర్యం: పిలవని కార్యక్రమాలకు వెళ్లడం, హృదయంతో కలవని స్త్రీతో సంభోగం, పాలకులు చూడని సేవ, పిలవని పేరంటం, కోరని స్నేహం చేయదగదు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
పరసతుల గోష్టినుండి పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్ బరుసతి సుశీయైనను బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!
తాత్పర్యం: భూమిపై, పర స్త్రీలతో సరససల్లాపాలు ఆడితే భీష్ముడయినా నిందను ఎదుర్కొనవలసిందే. ఇతర స్త్రీ ఎంత మంచిదయినా పర పురుషునితో స్నేహం చేస్తే అపకీర్తి పాలగును. |
| |
 |  |  |
|
 |  |  |
| |
పరసతి కూటమి గోరకు పరధనముల కాసపడకు పరునెంచకుమీ సరిగాని గోష్టి సేయకు సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!
తాత్పర్యం: ఇతర స్త్రీలతో కలయికను కోరవద్దు. ఇతరుల భాగ్యానికి ఆశపడకు. ఇతరుల దోషాలను లెక్కించవద్దు. మంచిది కాని సంభాషణ చేయవద్దు. భాగ్యం పోయినప్పుడు బంధువుల వద్దకు చేరకుము. |
| |
 |  |  |
|
 |  |  |
| |
తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ దలతోఁక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
తాత్పర్యం: పాముకి విషయం తలలోను, తేలుకు తోకలోనూ, దుష్టునకు నిలువెల్లా విషం ఉంటుంది. |
| |
 |  |  |
|
 |  |  |
| |
తన కోపమె తన శతృవు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!
తాత్పర్యం: తన కోపమే తనకు శతృవువలే బాధించును. తన శాంతమే తనను రక్షించును. దయయే చుట్టాలవలే సాయపడును. ఆనందమే ఇంద్రలోక సౌఖ్యము. దుఃఖమే నరకం అగును. ఇది నిజం |
| |
 |  |  |
|
 |  |  |
| |
చుట్టములు గానివారలు చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్ నెట్టుకొని యాశ్రయింతురు గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!
తాత్పర్యం: ధనం ఎక్కువగా ఉన్నట్లయితే బంధువులు కాని వారు కూడా మేము మీకు బంధువులమే అంటూ పట్టుదలతో గట్టిగా మనల్ని ఆశ్రయించడానికి వస్తారు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్ హేమంబుఁ గూడఁబెట్టిన భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!
తాత్పర్యం: చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు అజ్ఞాని కూడబెట్టిన బంగారమంతా రాజుల వశమై పోతుంది. |
| |
 |  |  |
|
 |  |  |
| |
కూరిమిగల దినములలో నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!
తాత్పర్యం: పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడూ కనిపించవు. ఆ స్నేహం చెడగానే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. ఇది నిజం. |
| |
 |  |  |
|
 |  |  |
| |
కరణము గరణము నమ్మిన మరణాంతకమౌను గాని మనలేడు సుమీ కరణము తన సరి కరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!
తాత్పర్యం: ఒక లేఖకుడు మరో లేఖకుని నమ్మితే మరణంతో సమానమైన ఆపదను కొనితెచ్చుకున్నట్లే. అందుకే, లేఖకుడు తనతో సమానమైన మరో లేఖరిని విశ్వసింపక, తన గుట్టును చెప్పక జీవించాలి. |
| |
 |  |  |
|
 |  |  |
| |
కమలములు నీడఁ బాసినఁ గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్ దమ దమ నెలవులు దప్పినఁ దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!
తాత్పర్యం: కమలములు పుట్టిల్లయిన నీటిని విడిచిపెట్టి మిత్రుడు అయిన సూర్యుని ఎండ తాకిన వెంటనే కమిలిపోతున్నాయి. అలాగే, మానవులు తమ నివాసాలను విడిచిపెడితే స్నేహితులే శతృలవుతారు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
కనకపు సింహాసనము శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ దొనరఁగ బట్టముగట్టిన వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!
తాత్పర్యం: శుభ ముహూర్తంలో కుక్కను తీసుకొచ్చి బంగారు సంహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా, దాని నిజనైజాన్ని ఎలా మానలేదో అల్పునికి ఎంత గౌరవం చేసి మంచి పదవి ఇచ్చినా తన నీచత్వాన్ని వదలలేడు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
కడు బలవంతుడైనను బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం దడవుండనిచ్చె నేనియు బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!
తాత్పర్యం: ఎంత సమర్థత కలవాడైనా యవ్వనంలో భార్యను చిరకాలం పుట్టింట ఉండనిచ్చినచో తానే స్వయంగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును. |
| |
 |  |  |
|
 |  |  |
| |
ఓడల బండ్లును వచ్చును ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును ఓడలు బండ్లును వలెనే వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!
తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చునట్లే, భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తూంటాయి. |
| |
 |  |  |
|
 |  |  |
| |
ఒల్లనిసతి నొల్లనిపతి నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే గొల్లండు గాక ధరలో గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!
తాత్పర్యం: తన్ను ప్రేమించని భర్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
ఎప్పుడు సంపద కలిగిన అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్ దెప్పలుగ జెరువునిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
తాత్పర్యం: చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు. |
| |
 |  |  |
|
 |  |  |
| |
ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్ సర్పంబు పడగనీడను గప్పవసించిన విధంబు గదరా సుమతీ!
తాత్పర్యం: నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికే యజమానిని సేవిచే వాడి బతుకూ ప్రాణభయంతో కూడినదే సుమా! |
| |
 |  |  |
|
 |  |  |
| |
ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా నుపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
తాత్పర్యం: మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి. |
| |
 |  |  |
|
 |  |  |
| |
ఉదకము ద్రావెడు హయమును మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్ మొదవుకడ నున్న వృషభము జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!
తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, కొవ్వుతో విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు, విద్యనేర్వని అల్పుని దగ్గరకు వెళ్లకుము. |
| |
 |  |  |
|
| |
No comments:
Post a Comment